శనివారం 04 జూలై 2020
Sports - May 12, 2020 , 20:10:12

‘ధోనీ, కేన్ కెప్టెన్సీ దాదాపు ఒకేలా ఉంటుంది’

‘ధోనీ, కేన్ కెప్టెన్సీ దాదాపు ఒకేలా ఉంటుంది’

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ, కేన్ విలియమ్సన్​ కెప్టెన్సీ మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని న్యూజిలాండ్ ఆల్​రౌండర్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. ధోనీ చాలా సహజమైన నాయకుడు అని చెప్పాడు. ఐపీఎల్​లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)​ ఫ్రాంచైజీ నిర్వహించిన ఇన్​స్టాగ్రామ్ లైవ్​లో సాంట్నర్ మాట్లాడాడు.

“మైదానంలో ప్రవర్తించే విషయంలో ధోనీ, విలియమ్సన్(న్యూజిలాండ్ కెప్టెన్)​ ఒకేలా ఉంటారు. వారిద్దరూ ఎంతో ప్రశాంతంగా, మౌనంగా ఉంటారు. ధోనీ ఎంతో సహజత్వంతో నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యూహాలు రచిస్తాడు. విలియమ్సన్​ కూడా మైదానంలో ఇలానే ఉంటాడు. ఎక్కువ హడావుడి లేకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రణాళికలను అమలు చేస్తాడు” అని సాంట్నర్ చెప్పాడు. గతేడాది ఐపీఎల్​లో చెన్నై తరఫున 4మ్యాచ్​లు ఆడిన సాంట్నర్ కీలకమైన ఇన్నింగ్స్​లు ఆడాడు. 


logo