శనివారం 28 మార్చి 2020
Sports - Mar 06, 2020 , 18:13:19

వరుసగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన ధోనీ: వీడియో

వరుసగా ఐదు బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన ధోనీ: వీడియో

చెన్నై:  ఐపీఎల్‌-2020 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి  ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి పాల్గొంటున్నాడు.   చాలా కాలం తర్వాత మహీ ప్రాక్టీస్‌కు రావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వస్తున్నారు.  హిట్టింగ్‌తో  ధోనీ ఫ్యాన్స్‌ను  అలరిస్తున్నాడు.  లీగ్‌ ఆరంభంకాక ముందే  చెన్నై సూపర్‌కింగ్స్‌ అభిమానులకు అప్పుడే ఐపీఎల్‌ మజా చూపిస్తున్నాడు. నెట్‌ ప్రాక్టీస్‌లోనే బెస్ట్‌ ఫినిషర్‌  ఐదు సిక్సర్లు బాదేశాడు. తాజాగా ఐపీఎల్‌ ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్‌ ధోనీ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకుంది.  వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 



logo