ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో అరుదైన ఘటన
లండన్: ఇంగ్లండ్ పురుషుల క్లబ్ క్రికెట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 12 ఏండ్ల తనయుడితో కలిసి ఓ తల్లి 143 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఆశ్చర్యపరిచింది. ఓంబీ సీసీ ట్రోజాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ ఆరెన్ బ్రిండల్.. తన కొడుకు హ్యారీతో కలిసి డిస్ట్రిక్ లీగ్ డివిజన్-3 మ్యాచ్లో తొలి వికెట్కు 143 పరుగులు జోడించింది. నెటెల్హమ్ క్రికెట్ అకాడమీతో జరిగిన మ్యాచ్లో 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రోజాన్స్ జట్టు.. ఆరెన్ బ్రిండల్ (101 బంతుల్లో 94 నాటౌట్; 17 ఫోర్లు), హ్యారీ (32 నాటౌట్) విజృంభణతో వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది.