బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 19, 2020 , 14:56:43

కెమ్‌చో.. మొతెరా లుక్ అదిరింది

కెమ్‌చో.. మొతెరా లుక్ అదిరింది

హైద‌రాబాద్‌:  కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌.. మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ.. ఈ  స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్ జ‌రిగిందంటే.. ప్రేక్ష‌కుల సంఖ్య‌ ల‌క్ష ఉండాల్సిందే.  ఇప్పుడు ఆ సంఖ్య‌ను దాటేసేందుకు కొత్త స్టేడియం త‌యారైంది.  అహ్మ‌దాబాద్‌లోని మొతారా స్టేడియం.. మెగా స్టేడియంగా రూపుదిద్దుకున్న‌ది.  అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మిత‌మైన ఈ స్టేడియాన్ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభించ‌నున్నారు.  ఈనెల 24వ తేదీన ట్రంప్‌, మోదీలు ఈ స్టేడియాన్ని ఆవిష్క‌రిస్తారు.  కెమ్‌చో ఈవెంట్‌లో భాగంగా ఈ స్టేడియాన్ని ప్రారంభించ‌నున్నారు.  సుమారు ల‌క్షా ప‌ది వేల మంది ప్రేక్ష‌కులు ఈ స్టేడియంలో మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌వ‌చ్చు. 

మొతెరా స్టేడియానికి సంబంధించిన కొత్త ఫోటోను ఇవాళ బీసీసీఐ ట్వీట్ చేసింది.  ఏరియ‌ల్ వ్యూలో తీసిన ఆ ఫోటోలో మొతెరా స్టేడియం క‌ల‌ర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.  ఈ ఫోటోను ట్వీట్ చేసిన వెంట‌నే .. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ కూడా స్పందించారు.  ఇంత పెద్ద భారీ స్టేడియాన్ని తిల‌కించ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు. ప్లేయ‌ర్‌గా, కెప్టెన్‌గా ఈ స్టేడియంలో ఆడిన అనుభూతిని మ‌రిచిపోలేన‌న్నాడు.  

అయితే కెమ్‌చో ఈవెంట్‌కు మాత్రం సుమారు ల‌క్షా 25 వేల మంది హాజ‌రుకానున్నారు. పాపుల‌స్ ఆర్కిటెక్చ‌ర్ సంస్థ ఈ స్టేడియాన్ని డిజైన్ చేసింది.  నిర్మాణం కోసం సుమారు 800 కోట్లు ఖ‌ర్చు చేశారు.  మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ స్టేడియం కెపాసిటీ ల‌క్షా 24 సీట్లు. ఇప్పుడు ఆ సంఖ్య‌ను మొతెరా దాటేస్తుంది.  మొతెరాను స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ స్టేడియం అని కూడా పిలుస్తారు.  ప్ర‌ధాన క్రికెట్ మైదానంతో పాటు మ‌రో రెండు క్రికెట్ గ్రౌండ్లు ఉంటాయి.  నాలుగు లాక‌ర్ రూమ్‌లు ఉన్నాయి. 75 ఏసీ కార్పొరేట్ బాక్సులు, జీసీఏ స‌భ్యుల‌కు క్ల‌బ్ హౌజ్ ఉంటుంది.  ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్‌, జిమ్‌, పార్టీ ఏరియాలు ఉన్నాయి.  స్డేడియంలో ఓ ఎంట్రీ వ‌ద్ద‌కు మెట్రో లైన్ నిర్మిస్తున్నారు. 


logo
>>>>>>