సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 05, 2020 , 11:09:53

సిడ్నీలో భారీ వ‌ర్షం.. సెమీస్‌పై అనుమానాలు !

సిడ్నీలో భారీ వ‌ర్షం.. సెమీస్‌పై అనుమానాలు !

గ్రూప్ లీగ్‌లో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్ల‌పై భారీ విజ‌యాలు సాధించిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఈ రోజు ఇంగ్లండ్‌తో సెమీస్ స‌మ‌రానికి సిద్ధ‌మైంది. గత టోర్నీ సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలోనే ఓడి ఇంటిబాటపట్టిన హర్మన్‌ గ్యాంగ్‌.. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాల‌నే క‌సిగా ఉంది. కాక‌పోతే గ‌త రాత్రి నుండి వ‌రుణుడు వ‌ద‌ల‌క‌పోవ‌డంతో ఈ సెమీస్ మ్యాచ్ జరిగే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ప‌ది ఓవ‌ర్ల మ్యాచ్ అయిన జ‌రపాల‌ని అంపైర్స్ భావిస్తున్న‌ప్ప‌టికీ, ప‌రిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్న‌ట్టు ఆస్ట్రేలియా మీడియా చెబుతుంది. అయితే మ్యాచ్ ర‌ద్దైన‌ప్ప‌టికీ  గ్రూప్ -ఏ లో మెరుగైన పాయింట్లు సాధించిన  భారత్‌ (8 పాయింట్లు) నేరుగా ఫైన‌ల్‌కి చేరుకుంటుంది.  సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించాలన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదనను ఐసీసీ తిరిస్కరించిన విషయం తెలిసిందే.


logo