పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్-2023 కోసం ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్‌ను నిర్వహిస్తోంది. ఈ లీగ్ 2020 జూలై నుంచి మార్చి 2023 వరకు జరుగుతోంది. 2023 క్రికెట్ వరల్డ్‌కప్ అర్హత కోసం లీగ్ నిర్వహిస్తున్నారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌నకు అర్హత సాధిస్తాయి.
ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్నందున టీమిండియా నేరుగా అర్హత సాధిస్తుంది. సూపర్ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5లో భారత్ నుంచి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, ఇంగ్లాండ్ హార్డ్‌హిట్టర్ జానీ బెయిర్‌స్టో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ వీరే..!
గ్లెన్ మాక్స్వెల్-22
జానీ బెయిర్‌స్టో-22
పాల్ స్టిర్లింగ్-16
హార్దిక్ పాండ్య-14
ఫకార్ జమాన్-13