గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 19, 2020 , 00:08:11

గచ్చిబౌలిలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించండి

 గచ్చిబౌలిలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించండి
  • క్రీడామంత్రి కిరణ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచన

ఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో క్రీడా వసతులపై మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు, అధికారులతో సమీక్షించారు. తెలుగు రాష్ర్టాల్లో క్రీడా ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా క్రీడా మంత్రి కిరణ్‌కు ఉపరాష్ట్రపతి సూచించారు. క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రైవేట్‌ రంగాన్ని భాగస్వాముల్ని చేయాలని, కాలేజీలు, వర్సిటీలు ఆటలను ప్రోత్సహించేలా చూడాలన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా వసతులపై ఆరా తీసిన వెంకయ్య నాయుడు..సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. గచ్చిబౌలి వేదికగా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాలని  మంత్రికి వివరించారు


logo
>>>>>>