ఆదివారం 01 నవంబర్ 2020
Sports - Sep 22, 2020 , 03:02:22

క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు

 క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు

  • షాద్‌నగర్‌ మినీ స్టేడియాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రూ.2.10 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో రాష్ట్రంలో అనేక క్రీడాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపట్టామన్నారు. ఇప్పటికే దాదాపు 50 స్టేడియాల నిర్మాణం పూర్తయ్యిందన్నారు.  ప్రారంభోత్సవం తర్వాత మంత్రి కొద్దిసేపు సరదాగా బ్యాడ్మింటన్‌ ఆడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితా రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.