బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 00:21:49

‘మంకీగేట్‌' మాయని మచ్చ

‘మంకీగేట్‌' మాయని మచ్చ

మెల్‌బోర్న్‌: మంకీగేట్‌ వివాదం తన కెప్టెన్సీలో ఓ మాయని మచ్చ అని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ అన్నాడు. ఆ ఘటన జరిగినప్పుడు పరిస్థితులు తన నియంత్రణలో లేకుండా పోయాయని బుధవారం ఓ కార్యక్రమంలో చెప్పాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌... ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ మధ్య మాటల యుద్ధం సాగింది. సైమండ్స్‌ భజ్జీ జాతివివక్షాపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆసీస్‌ ప్లేయర్లు ఆరోపించారు. 


భారత ప్లేయర్లంతా హర్భజన్‌కు మద్దతుగా నిలువగా.. విచారణ తర్వాత అతడు నిర్దోషిగా తేలాడు. దీనిపై రికీ దాదాపు పుష్కరం తర్వాత  స్పందించాడు. ‘మంకీగేట్‌ వివా దం నా కెప్టెన్సీలో అత్యంత దుర్భరమైన సమయం. 2005లో యాషెస్‌ సిరీస్‌ కోల్పోయినా పూర్తి నియంత్రణలో ఉన్నా. కానీ ఆ వివాదం సమయంలో జరిగిన పరిణామాల పట్ల నియంత్రణ కోల్పో యా. మంకీగేట్‌ వివాదం చాలా కాలం సాగడంతో కెప్టెన్సీలో కిందిస్థాయికి వెళ్లిపోయినట్టు అనిపించింది’ అని రికీ చెప్పాడు. మంకీగేట్‌ వివాదం తర్వాత భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య అంతరం విపరీతంగా పెరిగింది. పర్యటన మధ్యలోనే వైదొలగాలని టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఓ దశలో నిశ్చయించుకున్నా ఐసీసీ జోక్యంతో వెనక్కితగ్గారు. 


logo
>>>>>>