మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 21, 2020 , 20:08:00

KKR vs RCB: సిరాజ్‌ ట్రిపుల్‌ స్ట్రైక్‌.. 14 పరుగులకే 4 వికెట్లు

KKR vs RCB: సిరాజ్‌ ట్రిపుల్‌ స్ట్రైక్‌.. 14 పరుగులకే 4 వికెట్లు

అబుదాబి:  ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్      సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో  సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని గడగడలాడించాడు.  పదునైన పేస్‌తో బెంబేలెత్తించిన సిరాజ్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(1) వికెట్‌ కీపర్‌ డివిలియర్స్‌కు  క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే అప్పుడే క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణా(0) బౌల్డ్‌ అయ్యాడు.  నవదీప్‌ సైనీ వేసిన మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(1) కూడా ఔటయ్యాడు. రెండో బంతిని భారీ షాట్‌ ఆడగా మిడాన్‌లో క్రిస్‌మోరీస్‌ చేతికి చిక్కాడు.   

సిరాజ్‌ వేసిన నాలుగో ఓవర్‌లోనే టామ్‌ బాంటన్‌(10) కూడా కీపర్‌ ఏబీడీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో కోల్‌కతా 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఇయాన్‌ మోర్గాన్‌(1), దినేశ్‌ కార్తీక్‌(1) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.  6 ఓవర్లకు కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేసింది.