సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 18, 2021 , 11:56:10

సిరాజ్‌కు 5 వికెట్లు.. టీమిండియా టార్గెట్ 328

సిరాజ్‌కు 5 వికెట్లు.. టీమిండియా టార్గెట్ 328

బ్రిస్బేన్‌:  చివ‌రి టెస్ట్‌లో టీమిండియాకు 328 ప‌రుగుల ల‌క్ష్యాన్ని విధించింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్‌లో 294 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 33 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకుంటే.. ఓవ‌రాల్‌గా ఆస్ట్రేలియా 327 ప‌రుగుల లీడ్‌లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో హైద‌రాబాదీ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ 5 వికెట్లు తీయ‌డం విశేషం. సీనియ‌ర్ బౌల‌ర్లు లేక‌పోయినా ఆ భారాన్ని త‌న భుజాల‌పై మోసిన సిరాజ్‌.. టెస్ట్ కెరీర్‌‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అటు శార్దూల్ కూడా 4 వికెట్ల‌తో రాణించాడు. సుంద‌ర్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా టీమ్‌లో స్మిత్ 55, వార్న‌ర్ 48, గ్రీన్ 37 ప‌రుగులు చేశారు. 

VIDEOS

logo