శుక్రవారం 05 మార్చి 2021
Sports - Jan 21, 2021 , 15:27:03

తండ్రి స‌మాధి ద‌గ్గ‌ర సిరాజ్ ప్రార్థ‌న‌లు

తండ్రి స‌మాధి ద‌గ్గ‌ర సిరాజ్ ప్రార్థ‌న‌లు

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని గురువారం ఉద‌యం హైద‌రాబాద్ వ‌చ్చిన టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. నేరుగా త‌న తండ్రి స‌మాధి ద‌గ్గ‌రికి వెళ్లి ప్రార్థించాడు. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి క‌ల‌ను నిజం చేసే అవకాశం ద‌క్కినందుకు తాను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాన‌ని సిరాజ్ అన్నాడు. సిరాజ్ ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న స‌మ‌యంలోనే అత‌ని తండ్రి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే తండ్రి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన‌డం కోసం తిరిగి ఇండియాకు వెళ్లిపోవ‌చ్చ‌ని బీసీసీఐ సిరాజ్‌కు అవకాశం క‌ల్పించింది. కానీ సిరాజ్ మాత్రం అంత‌టి విషాదంలోనూ టీమ్‌తోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. తండ్రి ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లాడ‌న్న దుఃఖాన్ని దిగ‌మింగుకొని టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. చివ‌రి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి సిరీస్ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. అత‌ని తండ్రి ఓ ఆటో డ్రైవ‌ర్ అన్న విష‌యం తెలిసిందే. 

VIDEOS

logo