శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 26, 2020 , 16:43:55

తండ్రి చనిపోయినా దుఃఖాన్ని దిగమింగుకుని...దేశం కోసం సిరాజ్‌

తండ్రి చనిపోయినా దుఃఖాన్ని దిగమింగుకుని...దేశం కోసం సిరాజ్‌

నవంబర్‌ 20న భారత జట్టు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో తండ్రి చనిపోయిన వార్త సిరాజ్‌కు చేరింది. ఊహించని ఉత్పాతంతో ఒక్కసారిగా కుప్పకూలిన సిరాజ్‌.. తండ్రిని చూసేందుకు స్వదేశానికి వెళ్లేందుకు కూడా నిరాకరించాడు. క్వారంటైన్‌ నిబంధనల నేపథ్యంలో స్వదేశానికి వస్తే.. తిరిగి ఆస్ట్రేలియా చేరడం కష్టం కావడంతో బీసీసీఐ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడు. ఈ కష్ట కాలంలో కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి అతడికి అండగా నిలిచారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా నీ తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే ముఖ్యం అని చెప్పడంతో దుఃఖాన్ని దిగమింగి ఆసీస్‌లోనే ఉండిపోయాడు. 

జల్వా దిఖా... సిరాజ్‌


లక్ష్యం జాతీయ జట్టుకు ఆడటం. ఈ ప్రయాణంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు. అయినా గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. ఆటుపోట్లకు ఎదురీదుతూ కష్టాల కడలిని దాటుకుంటూ తన కలల ప్రయాణంలో మరో మజిలీకి చేరాడు మన హైదరాబాదీ మహమ్మద్‌ సిరాజ్‌. ఆట కోసం అన్నీ తానై... పూర్తి వివరాలు


తొలి టెస్టులోనే మెరిసిన హైద‌రాబాదీ..చదవండి 
logo