శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 27, 2020 , 00:31:24

టెస్ట్‌ జట్టులో సిరాజ్‌

టెస్ట్‌ జట్టులో సిరాజ్‌

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నిప్పులు చెరుగుతున్న హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. సీనియర్‌ పేసర్లు ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌ గాయాల బారిన పడటంతో.. అదనపు పేసర్‌గా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, ఇషాంత్‌ శర్మను పరిశీలనలో ఉంచిన బీసీసీఐ ప్రస్తుతానికి 18 మందితో కూడిన టెస్టు జట్టును ప్రకటించింది. ఆసీస్‌ పిచ్‌లు పేస్‌ సహకరించనున్న నేపథ్యంలో బుమ్రా, షమీ, ఉమేశ్‌, సైనీతో పాటు ఐదో పేసర్‌గా సిరాజ్‌ ఎంపికయ్యాడు.  వీరితో పాటు నాగర్‌కోటి, కార్తీక్‌త్యాగి, ఇషాన్‌ పొరెల్‌, నటరాజన్‌ అదనపు బౌలర్లుగా ఆసీస్‌ వెళ్లనున్నారు.