గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 18, 2021 , 16:06:07

సిరాజ్‌ను హగ్‌ చేసుకున్న బుమ్రా: వీడియో వైరల్‌

సిరాజ్‌ను హగ్‌ చేసుకున్న బుమ్రా: వీడియో వైరల్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సంచలన ప్రదర్శన చేశాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్‌(5/73) ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశాడు. ఆడిన తొలి టెస్టు సిరీస్‌లోనే  ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన సిరాజ్‌పై క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌లతో పాటు స్టార్క్‌, హేజిల్‌వుడ్‌లను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. 

రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 294 పరుగులకు  ఆలౌట్‌ చేసిన భారత బృందం  మైదానం నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌ వస్తుండగా రిజర్వ్‌ ఆటగాళ్లు చప్పట్లతో స్వాగతం పలికారు. అద్భుత ప్రదర్శనతో కంగారూలకు చుక్కలు చూపించిన సిరాజ్‌ను ప్రధాన పేసర్‌ బుమ్రా ఆప్యాయంగా హత్తుకొని అభినందించాడు.   హైదరాబాదీ పేసర్‌ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపించారు.     జట్టు సభ్యులు సిరాజ్‌ను అభినందిస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్‌ చేసింది. 

VIDEOS

logo