మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 21, 2020 , 01:40:44

సిరాజ్‌ తండ్రి కన్నుమూత

 సిరాజ్‌ తండ్రి కన్నుమూత

నమస్తే తెలంగాణ, ఆట ప్రతినిధి: భారత పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ తండ్రి గౌస్‌ (53) మృతి చెందారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించిన గౌస్‌.. తనకున్న పరిమిత వనరులతోనే కొడుకును టీమ్‌ఇండియాకు ఆడే స్థాయికి చేర్చారు. అయితే తండ్రిని కడసారి చూసుకునే అవకాశం హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌కు లేకుండాపోయింది. ఆస్ట్రేలియా పర్యటనకోసం ప్రస్తుతం సిడ్నీలో ఉన్న సిరాజ్‌.. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా స్వదేశానికి రావడం లేదని సమాచారం. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చక్కటి ప్రదర్శన చేసిన సిరాజ్‌.. తొలిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.