మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 18, 2021 , 09:18:32

స్మిత్ ఔట్.. ఆస్ట్రేలియా 205/5

స్మిత్ ఔట్.. ఆస్ట్రేలియా  205/5

బ్రిస్బేన్ వేదిక‌గా  ఆస్ట్రేలియా- ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశ‌గా సాగుతుంది.  తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 ప‌రుగులకు ఆలౌట్ కాగా, భార‌త్ 336 ప‌రుగులు చేసింది. ఇక ఆదివారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెట్ట‌గా 6 ఓవర్లలో 21 ప‌రుగులు చేశారు. హరీస్‌ (నాటౌట్‌) 1, వార్నర్‌ (నాటౌట్‌) 20 గా ఉన్నారు.

ఓవ‌ర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఆసీస్ వ‌రుస వికెట్ల‌ను కోల్పోతూ క‌ష్టాల‌లో ప‌డింది. డేవిడ్ వార్న‌ర్(48), హారిస్ (38), ల‌బుషేన్(25), వేడ్‌( 0)  ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెవీలియ‌న్‌కు క్యూ క‌ట్ట‌డంతో ఇన్నింగ్స్‌ని చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను స్టీవ్ స్మిత్, గ్రీన్ తీసుకున్నారు. అయితే 55 పరుగుల వ‌ద్ద స్మిత్ ఔట్ కావ‌డంతో క్రీజులోకి వ‌చ్చిన పైన్‌( 3).. గ్రీన్‌( 27) తో క‌లిసి స్కోరు బోర్డుని పరుగెత్తించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.  ప్రస్తుతం ఆస్ట్రేలియా 238 ప‌రుగుల ఆధిక్యంలో ఉండ‌గా, మ‌రో వంద ప‌రుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. భార‌త బౌల‌ర్స్‌లో సిరాజ్ మూడు వికెట్స్ తీయ‌గా, సుంద‌ర్,ఠాకూర్‌ల‌కు చెరో వికెట్ ద‌క్కింది.

VIDEOS

logo