బుధవారం 27 జనవరి 2021
Sports - Jan 10, 2021 , 16:48:35

సిరాజ్‌ను కోతి, కుక్క అని తిట్టారట‌!

సిరాజ్‌ను కోతి, కుక్క అని తిట్టారట‌!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట‌లో ఆసీస్ ఫ్యాన్స్‌.. టీమిండియా బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను బ్రౌన్ డాగ్‌, బిగ్ మంకీ అని తిట్టార‌ని ఓ బీసీసీఐ అధికారి వెల్ల‌డించారు. ఇవి రెండూ జాత్యహంకార వ్యాఖ్య‌లే అని ఆ అధికారి స్ప‌ష్టం చేశారు. ఆ వెంట‌నే ఈ విష‌యాన్ని ఆన్ ఫీల్డ్ అంపైర్ల దృష్టికి సిరాజ్ తీసుకెళ్లాడ‌ని, వాళ్లు బుమ్రాను కూడా ప‌దేప‌దే ఇలాగే తిట్టార‌ని ఆ బీసీసీఐ అధికారి చెప్పారు. నిజానికి మూడో రోజు ఆట‌లో ఇలాంటిది జ‌రిగిన‌ప్పుడు ఏకాగ్ర‌త దెబ్బ తిన‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో ప్లేయ‌ర్స్ రోజు ముగిసిన త‌ర్వాత విష‌యాన్ని అంపైర్ల దృష్టికి తీసుకొచ్చార‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను వెంట‌నే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని అంపైర్లు చెప్ప‌డంతో నాలుగో రోజు సిరాజ్ వెంట‌నే ఆన్‌ఫీల్డ్ అంపైర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పారు.


logo