సోమవారం 25 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 17:02:00

టీమ్‌ఇండియాకు మరో ఎదురుదెబ్బ

టీమ్‌ఇండియాకు మరో ఎదురుదెబ్బ

అడిలైడ్‌:ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఘోర ఓటమిని ఎదుర్కొన్న టీమ్‌ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఇన్నింగ్స్‌లో  బ్యాటింగ్‌ చేస్తుండగా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి గాయమైంది. ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ పాట్‌ కమిన్స్‌ వేసిన షార్ట్‌ పి‌చ్‌ బంతిని  ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి  షమీ మణికట్టుకు తాకగా బాధతో విలవిల్లాడాడు. వెంటనే జట్టు ఫిజియో కూడా మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశాడు.

ఈ సమయంలో షమీ తన చేతిని కూడా పైకిలేపడానికి ఇబ్బందిపడ్డాడు. దీంతో రిటైర్డ్‌హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. స్కానింగ్‌ కోసం వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.  టెస్టు సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో  షమీ ఆడటంపై ఇప్పుడు ఆందోళన నెలకొంది. స్కానింగ్‌ రిపోర్టులు వస్తే గాయం తీవ్రతపై ఓ అంచనాకు రావొచ్చని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. 

ఇవి కూడా చదవండి..

ఆ పంది మాంసం తినడానికి మంచిదేనంట!

బిట్‌కాయిన్ ప్ర‌కంప‌న‌లు.. 204 శాతం పెరిగిన క్రిప్టో క‌రెన్సీ

చంద్రుడి మట్టి నమూనాలు తెచ్చిన చైనా ‘చాంగె-5’ క్యాప్సూల్‌logo