శుక్రవారం 15 జనవరి 2021
Sports - Dec 19, 2020 , 00:54:54

హుసాముద్దీన్‌కు పతకం పక్కా

హుసాముద్దీన్‌కు పతకం పక్కా

  • ప్రపంచకప్‌ సెమీస్‌ చేరిన తెలంగాణ బాక్సర్‌

న్యూఢిల్లీ: జర్మనీ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ ప్రపంచకప్‌లో తెలంగాణ బాక్సర్‌ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన బౌట్‌లో హుసాముద్దీన్‌ 5-0 తేడాతో ఉమర్‌ బాజ్వా (జర్మనీ)ను సునాయాసంగా చిత్తుచేశాడు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పంచ్‌ల వర్షం కురిపించిన హుసామ్‌ టోర్నీలో కనీసం కాంస్య పతకాన్ని పక్కా చేసుకున్నాడు. కాగా మహిళల సెమీఫైనల్లో భారత బాక్సర్‌ సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (60 కేజీలు) 4-1తేడాతో మరియానా బసానెట్స్‌(ఉక్రెయిన్‌)పై గెలిచి తుదిపోరుకు చేరింది. పురుషుల పోటీలో సతీశ్‌ కుమార్‌ (+91కేజీలు) 5-0తో జవాతిన్‌ అలెక్సెల్‌పై గెలిచి సెమీస్‌ చేరాడు. 57 కేజీల బౌట్‌లో గౌరవ్‌ సొలాంకి గెలువగా, కవీందర్‌ బిస్త్‌కు నిరాశ ఎదురైంది. ఆశీష్‌ కుమార్‌ (75కేజీలు)  సైతం క్వార్టర్‌  ఫైనల్‌లో ఓడాడు. కాగా ప్రపంచ రజత పతక విజేత అమిత్‌ పంగాల్‌ (52 కేజీలు) ఫైనల్‌  చేరిన సంగతి తెలిసిందే.