మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 16:52:25

బ‌యోసెక్యూర్ రూల్ బ్రేక్‌.. ఐసోలేష‌న్‌లో పాకిస్థాన్ క్రికెట‌ర్‌

బ‌యోసెక్యూర్ రూల్ బ్రేక్‌.. ఐసోలేష‌న్‌లో పాకిస్థాన్ క్రికెట‌ర్‌

హైద‌రాబాద్‌: ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న పాక్ క్రికెట‌ర్లు బ‌యోసెక్యూర్ నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తున్నారు.  తాజాగా ఆల్‌రౌండ‌ర్ మొహ‌మ్మ‌ద్ హ‌ఫీజ్ ఆ నిబంధ‌న‌ల‌ను బ్రేక్ చేశారు. దీంతో అత‌న్ని టీమ్ యాజ‌మాన్యం ఐసోలేష‌న్‌లో పెట్టింది. కోవిడ్ ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌స్తేనే, అత‌న్ని తిరిగి జ‌ట్టులోకి తీసుకుంటారు. వాస్త‌వానికి ఇవాళ్టి నుంచి ఇంగ్లండ్‌తో పాక్ రెండవ టెస్టు ఆడుతున్న‌ది.  తాము ఉంటున్న హోట‌ల్ ప‌క్క‌న ఉన్న గోల్ఫ్ కోర్సుకు హ‌ఫీజ్ వెళ్లాడు. అక్క‌డ ఓ అభిమానితో అత‌ను ఫోటో దిగాడు. ఆ ఫోటోను అత‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లోనూ పోస్టు చేశాడు. అయితే రెండు మీట‌ర్ల దూరం అన్న సోష‌ల్ డిస్టాన్సింగ్ రూల్‌ను హఫీజ్ ఉల్లంఘించిన‌ట్లు అధికారులు గుర్తించారు.  బ‌యోసెక్యూర్ రూల్‌ను బ్రేక్ చేసిన హ‌ఫీజ్‌ను డాక్ట‌ర్లు ప‌రీక్షించారు. అత‌నికి కోవిడ్ టెస్టు కూడా చేశారు. ఆ రిపోర్ట్ ఇవాళ రానున్న‌ది. అయితే నెగ‌టివ్ వ‌చ్చేంత వ‌ర‌కు హ‌ఫీజ్‌ను ఐసోలేట్ చేస్తున్న‌ట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్ల‌డించింది.logo