శనివారం 23 జనవరి 2021
Sports - Dec 20, 2020 , 20:17:34

ఈడెన్‌ గార్డెన్స్‌ను సందర్శించిన అజారుద్దీన్‌

ఈడెన్‌ గార్డెన్స్‌ను సందర్శించిన  అజారుద్దీన్‌

కోల్‌కతా: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్ కోల్‌కతాలోని  ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్‌ను ఆదివారం సందర్శించాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీకి ముందు అజారుద్దీన్‌ ఈడెన్‌లో పర్యటించడం విశేషం. తన టూర్‌లో భాగంగా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడు  అవిశేక్‌ దాల్మియాతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా లాజిస్టిక్స్‌, బయో బబుల్‌ నిబంధనలపై చర్చించారు.   సయ్యద్ ముస్తాక్‌  అలీ ట్రోఫీ జనవరి 10న ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని  మోతెరా   స్టేడియం ఈ టోర్నమెంట్ నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.logo