శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 00:56:23

అజార్‌పై కేసు

అజార్‌పై కేసు

హైదరాబాద్‌: భారత మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌పై కేసు నమోదైంది. టిక్కెట్ల బుకింగ్‌ విషయంలో రూ.20.96లక్షలకు తనను మోసం చేసినట్లు దానిష్‌ష టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఏజెన్సీ యజమాని షాహాబ్‌..అజర్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశాడు. గత నవంబర్‌లో అజర్‌ వ్యక్తిగత సహాయకుడు ముజీబ్‌ఖాన్‌ అభ్యర్థన మేరకు అంతర్జాతీయ ఫ్లైట్‌ టిక్కెట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టినట్లు షాహాబ్‌ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలను అజర్‌ వీడియో ద్వారా ఖండించాడు. కావాలనే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, న్యాయ సలహాతో 100 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నట్లు అజర్‌ పేర్కొన్నాడు. 
logo