e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home స్పోర్ట్స్ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో ఆధిపత్య పోరు

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో ఆధిపత్య పోరు

  • కుమ్మలాటలు
  • తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్‌ మనోజ్‌!
  • నియామకం చెల్లదన్న అజారుద్దీన్‌

(హైదరాబాద్‌, ఆట ప్రతినిధి)హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హెచ్‌సీఏ నిబంధనలు ఉల్లంఘించాడంటూ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌కు అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం, అజర్‌ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడం చూశాం. ఇప్పటికే అజర్‌ హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌ తాజాగా అధ్యక్ష పదవికే ఎసరు తెచ్చేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న జాన్‌ మనోజ్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించడంతో హెచ్‌సీఏ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జింఖానా మైదానంలో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి జాన్‌ మనోజ్‌…హెచ్‌సీఏ పగ్గాలు స్వీకరించే అవకాశముందని తెలిసింది. ఇదిలా ఉంటే అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల వ్యవహార శైలిపై అధ్యక్షుడు అజర్‌ మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. శనివారం మీడియాతో మాట్లాడుతూ హెచ్‌సీఏ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ సభ్యులు వ్యవహరిస్తున్నారని, తాత్కాలిక అధ్యక్ష హోదా అనేది లేదని అజర్‌ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలివి.

ఆ నియామకం చెల్లదు: అజర్‌

అధ్యక్షుడిని విస్మరిస్తూ తాత్కాలిక అధ్యక్ష నియామకం అనేది హెచ్‌సీఏ రాజ్యాంగానికి విరుద్ధం. అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి అనుమతి లేకుండా ఇలాంటి చర్యలకు పూనుకోవడం నిబంధనలను ఉల్లంఘించడమే. అపెక్స్‌ కౌన్సిల్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ఏకమై నాపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు. భారత క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా హెచ్‌సీఏ అభివృద్ధి కోసం పాటుపడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ గత కొన్నేండ్ల నుంచి హెచ్‌సీఏలో వారిదే ఆధిపత్యం నడుస్తున్నది. పరిమితికి మించి క్లబ్‌లు కలిగి ఉండి హెచ్‌సీఏపై ఆధిపత్యం చెలాయించేందుకు కౌన్సిల్‌ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. బోర్డు నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తూ పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ఉన్నారు. ఏసీబీ కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్లు నాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. హెచ్‌సీఏ కార్యకలాపాలను హైదరాబాద్‌ వరకు పరిమితం చేయకుండా తెలంగాణలోని మిగతా జిల్లాలకు విస్తరించాలనుకుంటున్నాను. రానున్న సీజన్‌లో టీ20 టోర్నీలో హెచ్‌సీఏ పరిధిలోని 216 క్లబ్‌లకు ఆడే అవకాశం కల్పిస్తున్నాం. అసోసియేషన్‌ చరిత్రలో ఇది ఎప్పుడు జరుగలేదు.

‘అజర్‌ వన్‌మ్యాన్‌ షో’: జాన్‌ మనోజ్‌

- Advertisement -

హెచ్‌సీఏలో అజారుద్దీన్‌ది వన్‌మ్యాన్‌ షో వైఖరి. ప్రతి సమావేశం నిబంధనలకు విరుద్ధమని అజర్‌ వాదిస్తాడు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడన్న కారణంతోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుల సమిష్టి నిర్ణయంతో అతడిపై సస్పెన్షన్‌ వేశాం. నిర్ణీత గడువులోగా సమాధానం చెప్పాలంటూ షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశాం. అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి సస్పెన్షన్‌లో ఉంటే తాత్కాలిక అధ్యక్షుడిని నియమించడమనేది సాధారణం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవు. హెచ్‌సీఏ రాజ్యాంగానికి అనుగుణంగా మేము ముందుకు వెళుతున్నాం. క్రికెట్‌ అభివృద్ధి గురించి మాట్లాడకుండా అజర్‌ సొంత ఎజెండా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకాన్ని హెచ్‌సీఏ ఏజీఎమ్‌లో 107 మంది వ్యతిరేకించారు. అపెక్స్‌ కౌన్సిల్‌తో పాటు కార్యవర్గ సభ్యులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. సోమవారం తాత్కాలిక అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana