శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Feb 18, 2021 , 02:43:55

రేపటి నుంచి ఫెన్సింగ్‌ టోర్నీ

రేపటి నుంచి ఫెన్సింగ్‌ టోర్నీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: మర్రి లక్ష్మణ్‌ రెడ్డి ఇనిస్టిట్యూట్‌   (ఎమ్‌ఎల్‌ఆర్‌ఐటీ) కాలేజీ వేదికగా ఈనెల 19, 20 తేదీల్లో అంతర్‌జిల్లాల ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ జరుగనుంది. ఆయా జిల్లాల జట్ల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్లేయర్లు ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌తో పాటు నాలుగు ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ఫెన్సింగ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జరుగుతున్న తొలి అంతర్‌జిల్లాల టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారు ఒడిశా, ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ టోర్నీల్లో పాల్గొనే అవకాశముంటుంది.  

VIDEOS

logo