సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 06, 2020 , 20:38:33

చీరకట్టులో క్రికెట్‌ ఆడిన మిథాలీరాజ్‌..వీడియో

చీరకట్టులో క్రికెట్‌ ఆడిన మిథాలీరాజ్‌..వీడియో

సాధారణంగా క్రికెటర్లు స్పోర్ట్స్‌ జెర్సీతో మైదానంలోకి దిగి ఆట ఆడుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ టీమిండియా మహిళా క్రికెట్‌ జట్టు సారథి మిథాలీరాజ్‌ సంప్రదాయక చీరకట్టులో క్రికెట్‌ ఆడి యావత్‌ ప్రపంచమంతా తనవైపు చూసేలా చేసింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని..మెల్‌ బోర్న్‌ స్టేడియంలో హర్మన్‌ ప్రీత్‌ జట్టు ఆసీస్‌తో టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిథాలీరాజ్‌ ప్రత్యేకంగా వీడియోను రూపొందించారు. ఈ వీడియో ఇపుడు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. 

logo