గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 18:40:51

త‌ప్పించ‌డంతో నిరాశ‌చెందా: మిథాలీ

త‌ప్పించ‌డంతో నిరాశ‌చెందా:  మిథాలీ

న్యూఢిల్లీ:  పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ తుది జ‌ట్టులో త‌న‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై వెట‌ర‌న్ బ్యాట్స్ఉమెన్ మిథాలీరాజ్ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. కీల‌క‌మైన మ్యాచ్‌లో తుదిజ‌ట్టులో నుంచి త‌ప్పించినందుకు చాలా నిరాశ చెందాన‌ని చెప్పింది. `స‌రిలేరు మీకెవ్వ‌రూ` అనే క్రీడా కార్య‌క్ర‌మంలో మిథాలీ త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది. 

2018 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో.. అప్ప‌టి కోచ్ ర‌మేశ్ పొవార్‌తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా మిథాలీని జ‌ట్టు నుంచి ప‌క్క‌కు త‌ప్పించిన విష‌యం తెలిసిందే. లీగ్ ద‌శ‌లో అద్భుతంగా ఆడిన మిథాలీని స్ట్ర‌యిక్ రేట్ త‌క్కువ ఉంద‌నే సాకుతో పొవార్ ప‌క్క‌న పెట్టాడు. కాగా.. ఆ మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మి పాలైంది. దీంతో ర‌మేశ్ పొవార్‌, కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై అప్ప‌ట్లో బోర్డుకు లేఖ రాసిన మిథాలీ.. తాజాగా గ‌ర్ల్ ప‌వ‌ర్ కార్య‌క్ర‌మంలో భాగంగా త‌న భావాల‌ను బ‌య‌ట పెట్టింది. logo