బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Jan 17, 2020 ,

గ్రేడ్‌ ఎ నుంచి బి లోకి మిథాలీ

 గ్రేడ్‌ ఎ నుంచి బి లోకి మిథాలీ


న్యూఢిల్లీ: భారత వన్డే కెప్టెన్‌ మిథాలీరాజ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో భాగంగా మిథాలీని గ్రేడ్‌-ఎ నుంచి తప్పిస్తూ బి కేటగిరికి మార్చింది. గతేడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన ఈ 37 ఏండ్ల హైదరాబాదీ..2021 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ముందుండి నడిపించాలని చూస్తున్నది. అయితే బోర్డు తాజా నిర్ఱయంతో గ్రేడ్‌-బికి పడిపోయిన మిథాలీ ఇప్పటి నుంచి వేతనం కింద ఏడాదికి రూ.30 లక్షలు తీసుకోనుంది. మరోవైపు  హర్మన్‌ప్రీత్‌కౌర్‌, స్మృతి మందనతో పాటు పూనమ్‌ యాదవ్‌ గ్రేడ్‌-ఎలో నిలిచారు. 15 ఏండ్ల షెఫాలీ వర్మ, హర్లిన్‌ డియోల్‌ ఈసారి కొత్తగా సెంట్రల్‌ కాంట్రాక్టు దక్కించుకున్నారు. 


logo
>>>>>>