బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 23, 2020 , 16:31:48

సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ..ఐపీఎల్‌ నుంచి మార్ష్‌ ఔట్‌

సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ..ఐపీఎల్‌ నుంచి  మార్ష్‌  ఔట్‌

దుబాయ్‌:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ప్లేయర్‌ మిచెల్‌ మార్ష్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో మార్ష్‌ గాయపడ్డాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ వేసిన మార్ష్‌  రెండో బంతికి ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ కొట్టిన బంతిని ఆపే క్రమంలో అతని చీలమండకు తీవ్ర గాయమైంది.   ఇప్పటికే మిడిలార్డర్‌ బలంగా లేని సన్‌రైజర్స్‌కు మార్ష్‌ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బే.    మార్ష్‌ స్థానంలో   వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. 

 మిడిలార్డర్‌లో సరైన ఆటగాళ్లు లేకపోవడంతోనే సన్‌రైజర్స్‌ ఓటమితో ఐపీఎల్‌ 13వ సీజన్‌ను ప్రారంభించింది. గత సోమవారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 


logo