శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 17:21:29

ఆమెను చాలా మిస్ అవుతున్నా : మ‌హ్మ‌ద్ ష‌మీ

ఆమెను చాలా మిస్ అవుతున్నా : మ‌హ్మ‌ద్ ష‌మీ

త‌న కుమార్తెను చాలా మిస్ అవుతున్నాన‌ని టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ అన్నాడు. కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ త‌ర‌పున ఐపీఎల్ ఆడ‌నున్న ష‌మీ ప్ర‌స్తుతం యూఏఈలో సాధ‌న చేస్తున్నాడు. విడిపోయిన భార్య హ‌సీన్‌ జ‌హా వ‌ద్ద‌నున్న త‌న కుమార్తె గురించి ష‌మీ మాట్లాడుతూ లాక్‌డౌన్ కాలంలో ఐరాను చాలా మిస్ అయ్యాన‌న్నాడు. “‌లాక్‌డౌన్ సమయంలో నేను ఆమెను కలవలేకపోయాను. నా కుమార్తె వేగంగా పెరుగుతోంది. నేను ఆమెను చాలా మిస్ అయ్యాను” అని షమీ తెలిపాడు.  

ప్రాక్టీస్ ఎలా జ‌రుగుతుంద‌న్న ప్ర‌శ్న‌కు ష‌మీ మాట్లాడుతూ “మేము క్రికెట్ ఆడి చాలా కాలం అయ్యింది. ప్రతి ఒక్కరూ తాము ఎక్కువగా ఇష్టపడే ఆట‌కు తిరిగొచ్చిన‌ప్పుడు చాలా సంతోష‌ప‌డ్డారు. మాకు గురువారం ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. నేను ఏ సమస్యలను ఎదుర్కోలేదు. ప్రాక్టీస్ చేస్తుండ‌డంతో అంద‌రూ తిరిగి పూర్వ‌వైభ‌వాన్ని పొందుతున్నారు.” అని షమీ ‌అన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo