బుధవారం 08 జూలై 2020
Sports - May 25, 2020 , 23:11:13

'ఆ నిబంధన పాటించాలంటే బౌలర్లకు మాస్కులుండాలి'

'ఆ నిబంధన పాటించాలంటే బౌలర్లకు మాస్కులుండాలి'

కరాచీ: క్రికెట్‌ పునఃప్రారంభానికి ఐసీసీ సూచించిన మార్గదర్శకాలను పాటించడం చాలా కష్టమని పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌ అభిప్రాయపడ్డాడు. బంతికి ఉమ్మి రాయడం బౌలర్లకు అలవాటుగా ఉందని, వారు అలా చేయకూడదంటే మాస్కులు ధరించాలన్న నిబంధన విధించాలని మిస్బా సోమవారం ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు.

"ఇది అంత సులువు కాదు(ఉమ్మి రాయకుండా బౌలింగ్‌ చేయడం). క్రికెట్‌లో ఎప్పటి నుంచో ఆటగాళ్లకు ఇది అలవాటుగా ఉంది. కొత్త నిబంధనలు మనసులో ఉన్నా.. కొన్నిసార్లు అనుకోకుండానే ప్లేయర్లు ఉమ్మిని వాడే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బౌలర్లు మాస్కులు ధరించాలనే లాంటి కొన్ని నిబంధన పెడితే.. ఉమ్మి వాడకుండా నిరోధించవచ్చు" అని మిస్బా చెప్పాడు. కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించాలని ఐసీసీ క్రికెట్‌ కమిటీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.  


logo