మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 16, 2020 , 02:22:16

షూటింగ్‌ అకాడమీకి ప్రభుత్వ సహకారం

 షూటింగ్‌ అకాడమీకి ప్రభుత్వ సహకారం

మాజీ ఒలింపియన్‌ గగన్‌ నారంగ్‌తో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గగన్‌ నారంగ్‌ షూటింగ్‌ అకాడమీ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మాజీ ఒలింపియన్‌లు గగన్‌ నారంగ్‌, ముకేశ్‌ కుమార్‌ శనివారం క్రీడాశాఖ మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని నారంగ్‌ అకాడమీలో యువ షూటర్లకు సొంత ఖర్చులతో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తున్నట్లు గగన్‌ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందిచిన శ్రీనివాస్‌గౌడ్‌.. ‘రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలోనే అకాడమీని సందర్శిస్తా. క్రీడాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అకాడమీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తా’ అని అన్నారు.