ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 19, 2021 , 01:00:11

విజేత పాలమూరు

విజేత పాలమూరు

  • అట్టహాసంగా నెట్‌బాల్‌ టోర్నీ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జనవరి 18 : రాష్ట్రస్థాయి అండర్‌-19 జూనియర్‌ నెట్‌బాల్‌ టోర్నీ బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌, బాలికల విభాగంలో ఖమ్మం జట్లు విజేతలుగా నిలిచాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో నిర్వహించిన టోర్నీని  స్థానిక స్టేడియంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సోమవారం ప్రారంభించారు. కాసేపు సరదాగా నెట్‌బాల్‌ ఆడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రధాన స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని మైదానాలు ఏర్పాటు చేస్తామన్నారు. బాలుర ఫైనల్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 21-16తో ఖమ్మంపై, బాలికల తుదిపోరులో ఖమ్మం 26-16తో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించాయి. ఉమ్మడి 10 జిల్లాల నుంచి మొత్తం 280 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, ఒలింపిక్‌ సంఘం జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, జాతీయ నెట్‌బాల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఖాజాఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo