Minister Yerrabelli Dayakar Rao : బుడగ జంగాలను గుర్తించింది సీఎం కేసీఆరే అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Yerrabelli Dayakar Rao) అన్నారు. బుడగ జంగాలు సీఎం కేసీఆర్(CM KCR)కు రుణపడి ఉండాలని, మరోసారి బీఆర్ఎస్(BRS) పార్టీని గెలిపించాలని హైదరాబాద్లో బుడగ జంగాల చైతన్య వేదిక రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బుడగ జంగాలను గుర్తించింది సీఎం కేసీఆరే అని, మనమంతా ఆయనకు రుణపడి ఉండాలని అన్నారు.
అందరూ మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదేనని ఎర్రబెల్లి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, బుడగ జంగాల సంఘాల ప్రతినిధులు, నాయకులు, వాళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.