e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home స్పోర్ట్స్ మోర్‌హౌజ్‌కు జోర్డాన్‌ 72 కోట్ల విరాళం

మోర్‌హౌజ్‌కు జోర్డాన్‌ 72 కోట్ల విరాళం

మోర్‌హౌజ్‌కు జోర్డాన్‌ 72 కోట్ల విరాళం

అట్లాంటా(అమెరికా): బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైఖేల్‌ జోర్డాన్‌ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అట్లాంటాలోని మోర్‌హౌజ్‌ కాలేజీకి రూ.72.39 కోట్ల విరాళం అందించాడు. జర్నలిజం అభివృద్ధితో పాటు క్రీడా సంబంధిత కోర్సుల కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపాడు. హాలీవుడ్‌ డైరెక్టర్‌, యాక్టర్‌ స్పైక్‌ లీతో కలిసి జోర్డాన్‌ ఇచ్చిన ఈ విరాళాన్ని స్కాలర్‌షిప్స్‌, విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడే టెక్నాలజీని మరింత మెరుగుపరుస్తామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. ‘ముఖ్యంగా నల్ల జాతీయుల చరిత్ర ఏంటో తెలుసుకునేందుకు విద్య అనేది చాలా ముఖ్యం. మన గత చరిత్ర తెలుసుకుంటేనే భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోగల్గుతాం. స్పోర్ట్స్‌ జర్నలిజం, అథ్లెటిక్స్‌లో నల్ల జాతీయుల నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు ఇది దోహదపడుతుంది. ఇప్పటికే 80 మంది విద్యార్థులను తయారు చేశాం. వీరంతా పలు మీడియా సంస్థల్లో, క్రీడల్లో రాణిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగిస్తాం’ అని జోర్డాన్‌ అన్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మోర్‌హౌజ్‌కు జోర్డాన్‌ 72 కోట్ల విరాళం

ట్రెండింగ్‌

Advertisement