సోమవారం 06 జూలై 2020
Sports - Apr 22, 2020 , 17:03:21

వీడియో: ఏడేండ్ల చిన్నారి ఆట​కు వాన్ ఫిదా

వీడియో: ఏడేండ్ల చిన్నారి ఆట​కు వాన్ ఫిదా

న్యూఢిల్లీ: ఏడేండ్ల అమ్మాయి క్రికెట్​ ఆట తీరుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆశ్యర్యపోయాడు. పరి శర్మ అనే చిన్నారి.. అద్భుతమైన ఫుట్​వర్క్​తో బంతిని ఆఫ్​సైడ్​, లెగ్​సైడ్ బాదుతున్న వీడియోను సోషల్ మీడియాలో వాన్ బుధవారం పంచుకున్నాడు. 'ఓసారి ఈ వీడియో చూడండి, ఏడేండ్ల పరి శర్మ.. ఆమె కదలిక, ఆట అద్భుతం' అని పేర్కొన్నాడు. ఈ వీడియోలో ఆ చిన్నారి కవర్​ డ్రైవ్​లు, ఆఫ్ డ్రైవ్​లు, పుల్​షాట్లు అలవోకగా, చూడచక్కగా ఆడింది. 


logo