మంగళవారం 07 జూలై 2020
Sports - Jun 07, 2020 , 01:06:31

జాతి శ్రేయస్సుకు 755 కోట్లు: జోర్డాన్‌

జాతి శ్రేయస్సుకు 755 కోట్లు: జోర్డాన్‌

కరోలినా: నల్లజాతీయుల శ్రేయస్సు కోసం వచ్చే పదేండ్లలో రూ. 755 కోట్లు (100 మిలియన్‌ డాలర్లు) ఖర్చు పెట్టనున్నట్లు అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకెల్‌ జోర్డాన్‌ తెలిపాడు. పోలీసుల దుశ్చర్య కారణంగా జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి చెందినప్పటి నుంచి నిరసనలతో అమెరికా అట్టుడికిపోతున్నది. ఈ క్రమంలో పోరాటం చేస్తున్న వారికి తన వంతుగా సాయం చేసేందుకు జోర్డాన్‌ ముందుకొచ్చాడు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య తదితర అంశాల కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాడు.


logo