MI vs KKR | ఐపీఎల్లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సాధారణ స్కోర్ చేసింది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై ఆటగాళ్లు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో బరిలో దిగారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు తీశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మొదటి ఓవర్ నుంచే పరుగుల వేట మొదలుపెట్టారు. క్వింటన్ డికాక్ (55) హాఫ్ సెంచరీతో మెరిశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 30 బంతుల్లో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14), కృనాల్ పాండ్య (12) ఆకట్టుకోలేకపోయారు. పోలార్డ్ 21 పరుగులకే రన్నౌట్ అయ్యాడు. కోల్‌కతా గెలవాలంటే 120 బంతుల్లో 156 పరుగులు చేయాల్సి ఉంది.