బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 03, 2020 , 11:50:57

మార‌డోనాకు నివాళి.. మెస్సీకి జ‌రిమానా!

మార‌డోనాకు నివాళి.. మెస్సీకి జ‌రిమానా!

బార్సిలోనా: అర్జెంటీనా లెజెండ‌రీ ప్లేయ‌ర్ డీగో మార‌డోనాకు ఓ మ్యాచ్ సంద‌ర్భంగా నివాళి అర్పించినందుకు స్టార్ ప్లేయ‌ర్ లియోనెస్ మెస్సీకి జ‌రిమానా విధించారు. బార్సిలోనా త‌ర‌ఫున మ్యాచ్ ఆడుతున్న మెస్సీ.. ఒసాసునా టీమ్‌పై 4-0తో గెలిచిన త‌ర్వాత త‌న ష‌ర్ట్ విప్పాడు. లోప‌ల నెవెల్స్ ఓల్డ్ బాయ్స్‌కు చెందిన మార‌డోనా జెర్సీని వేసుకున్న మెస్సీ.. ఇలా వినూత్నంగా ఆ లెజెండ‌రీ ప్లేయ‌ర్‌కు ఘ‌న నివాళి అర్పించాడు. అయితే అదే అత‌నిపై 600 యూరోల (సుమారు రూ.54 వేలు) జరిమానా విధించ‌డానికి కార‌ణ‌మైంది. అత‌నితోపాటు బార్సిలోనా టీమ్‌కు కూడా 180 యూరోల (సుమారు రూ.16 వేలు) జ‌రిమానా విధించింది స్పానిష్ సాక‌ర్ ఫెడ‌రేషన్‌. అక్క‌డి నిబంధ‌న‌ల ప్ర‌కారం మ్యాచ్ స‌మ‌యంలో ప్లేయ‌ర్ ష‌ర్ట్ విప్ప‌కూడ‌దు. అయితే ఇది ఓ దిగ్గ‌జ ఆట‌గాడికి నివాళి అర్పించ‌డానికి కాబ‌ట్టి.. ఎలాంటి జ‌రిమానా విధించ‌కూడ‌ద‌ని బార్సిలోనా టీమ్ వాదించింది. అయినా ఫెడ‌రేష‌న్ మాత్రం అందుకు అంగీక‌రించ‌లేదు. అది నివాళి అర్పించ‌డ‌మే అయినా.. ఓ ప్లేయ‌ర్ ఉద్దేశంతో సంబంధం లేకుండా మ్యాచ్ మ‌ధ్య‌లో ష‌ర్ట్ విప్ప‌డం త‌ప్పిద‌మే అవుతుంద‌ని ఫెడ‌రేష‌న్ స్పష్టం చేసింది. 


logo