ఆర్ఎక్స్ 100 చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఈ అమ్మడు సినిమాలతో ఎంత పాపులర్ అయిందో తెలియదు కాని సోషల్ మీడియా ద్వారా అశేష ప్రేక్షకాదరణను పొందింది. హాట్ హాట్ ఫొటోస్‌తో హీటెక్కిస్తున్న ఈ అమ్మడు యూత్‌కు కంటిపై కనుకు లేకుండా చేస్తుంది. ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత పాయల్‌కు సరైన హిట్ దక్కలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారానే తెగ సందడి చేస్తుంది.
తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రలలో తెరకెక్కిన గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకే కావాలే అనే పాటకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అందరి మతులు పోగొడుతుంది. ముఖ్యంగా చీరకట్టులో పాయల్‌ను చూస్తున్న ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాయల్ రాజ్‌పుత్ వీడియో తెగ వైరల్ అవుతుంది.