ఆదివారం 07 జూన్ 2020
Sports - Mar 30, 2020 , 12:42:49

‘మనసంతా వాంఖడేలోనే..’

‘మనసంతా వాంఖడేలోనే..’

ముంబై: ఐపీఎల్ ప్రారంభం కాకపోవడంపై ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్​ నిరాశ చెందినట్టున్నాడు. దేశవాళీ క్రికెట్​లో దమ్మురేపిన అతడు ఐపీఎల్​లోనూ జోరు కొనసాగించాలని ఆశించగా.. కరోనా వైరస్ నిరాశమిగిల్చింది. ఈ నేపథ్యంలో తన మనసంతా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉందంటూ సూర్యకుమార్ సోమవారం ట్వీట్ చేశాడు. “మానసికంగా వాంఖడే స్టేడియంలో ఉన్నా. కానీ శారీరకంగా ఇంట్లో ఉన్నా” అని గత సీజన్ ఫొటోను, ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఫొటోను సూర్యకుమార్ ట్వీట్​కు జతచేశాడు. అలాగే అందరూ ఇంటికే పరిమితమై సురక్షితంగా ఉండాలంటూ సూచించాడు. తొలుత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న వాంఖడే స్టేడియంలో ముంబై – చెన్నై మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగాల్సింది. కరోనా వైరస్ వల్ల ఏప్రిల్​ 15కు ఐపీఎల్ 13వ సీజన్ వాయిదా పడగా.. లాక్​డౌన్ నేపథ్యంలో అప్పుడు కూడా ప్రారంభమయ్యేది కష్టమే. logo