మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 00:47:49

ప్రజాదరణలో కోహ్లీనే టాప్‌

ప్రజాదరణలో కోహ్లీనే టాప్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే ప్రపంచంలో అత్యంత పాపులర్‌ క్రికెటర్‌ అని ఓ అధ్యయనం తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆన్‌లైన్‌లో కోహ్లీ గురించే ఎక్కువ శోధిస్తున్నారని ఆన్‌లైన్‌ సంస్థ ఎస్‌ఈఎం రష్‌ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి, జూన్‌ మధ్య కాలంలో ప్రతి నెలా సగటున కోహ్లీ గురించి ఆన్‌లైన్‌లో 16.2లక్షల శోధనలు జరిగాయని తెలిపింది. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం కోహ్లీ తర్వాతి స్థానంలో భారత స్టార్లు రోహిత్‌ శర్మ(9.7లక్షలు),  ధోనీ(9.4లక్షలు) ఉన్నారు.  టాప్‌-10లో హార్దిక్‌ పాండ్య(7.1లక్షలు), క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(6.7లక్షలు), శ్రేయస్‌ అయ్యర్‌ (4.1లక్షలు) చోటు దక్కించుకున్నారు. ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన క్రికెట్‌ జట్టుగానూ టీమ్‌ఇండియానే ఉంది. ఆ తర్వాత ఇంగ్లం డ్‌, ఆస్ట్రేలియా ఉన్నాయి. మహిళా క్రికెటర్లు టాప్‌-10లో లేకున్నా భారత స్టార్‌ స్మృతి మంధాన 12వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఎలీస్‌ పెర్రీ 20వ స్థానం దక్కించుకుంది.  


logo