మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 16:39:46

ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్ట్‌ టీమ్‌ మెంబర్‌కు కరోనా పాజిటివ్‌

ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్ట్‌ టీమ్‌ మెంబర్‌కు కరోనా పాజిటివ్‌

ముంబై: రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌  సకాలంలో ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు మళ్లీ మొదలయ్యాయి.  సోమవారం భారత్‌ నుంచి   యూఏఈ బయలుదేరాల్సిన స్టార్‌ ప్రొడక్షన్‌ సిబ్బందిలో కనీసం ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ యూఏఈ ప్రయాణాలను రద్దు చేసుకున్నది. యూఏఈ వెళ్లడానికి సిద్ధమైన మొదటి బ్యా్‌చ్‌లో స్టార్‌ ఉద్యోగికి వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే మిగతా ప్రొడక్షన్‌ టీమ్‌ సభ్యులందరి కరోనా పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతనే యూఏఈకి వెళ్లాలని స్టార్‌ స్పోర్ట్స్‌ సంస్థ భావిస్తున్నది. 

సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ ప్రారంభంకావాల్సి ఉండగా ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లకు  కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆ జట్టు సీనియర్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా చెన్నై యాజమాన్యంతో వచ్చిన విభేదాలతో ఏకంగా సీజన్‌ నుంచి వైదొలిగి స్వదేశానికి వచ్చేశాడు.  


logo