శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 17, 2020 , 15:31:21

మెల్‌బోర్న్‌లో కరోనా టెన్ష‌న్‌.. తొలి టెస్ట్ డౌటే !

మెల్‌బోర్న్‌లో కరోనా టెన్ష‌న్‌..  తొలి టెస్ట్ డౌటే !

హైద‌రాబాద్‌: అడిలైడ్‌లో సోమ‌వారం కొత్త‌గా క‌రోనా వైర‌స్ కేసులు అధిక సంఖ్య‌లో న‌మోదు అయ్యాయి. దీంతో అక్క‌డ మ‌ళ్లీ వైర‌స్ కేసులు పెరుగుతున్న‌ట్లు ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.  ఈ నేప‌థ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా .. అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.  డిసెంబ‌ర్ 17వ తేదీన అడిలైడ్‌లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు జ‌ర‌గాల్సి ఉన్న‌ది. ప్ర‌స్తుతం ద‌క్షిణ ఆస్ట్రేలియాలో ఉన్న ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొన్న‌ది.  అడిలైడ్ ఓవ‌ల్‌లో క‌చ్చితంగా తొలి టెస్ట్‌ను నిర్వ‌హించేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఇవాళ సీఏ చెప్పింది.  

కోవిడ్ కేసులు ఒక్క‌సారిగా వ్యాప్తి కావ‌డంతో.. ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పెయిన్ సోమ‌వారం సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లాడు. అడిలైడ్‌లో కేసులు గుప్పుమ‌న‌డంతో.. వెస్ట్ర‌న్ ఆస్ట్రేలియా, టాస్మానియా రాష్ట్రాలు త‌మ స‌రిహ‌ద్దుల‌ను మూసివేశాయి.  సోమ‌వారం రాత్రి నుంచి అడిలైడ్ వ‌చ్చే వారికి 14 రోజుల పాటు హోట‌ల్ క్వారెంటైన్ నిబంధ‌న‌ల‌ను అమ‌లుచేయ‌నున్నారు.  క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆస్ట్రేలియాలో స‌మ్మ‌ర్ క్రికెట్ అయోమ‌యంలో ప‌డిన‌ట్లు అనుమానాలు వ‌స్తున్నాయి. కానీ అలాంటి డౌట్ అవ‌స‌రం లేద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా స్ప‌ష్టం చేసింది. 

అడిలైడ్ టెస్ట్‌కు ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతున్నా.. ఆ మ్యాచ్‌పై ద‌క్షిణ ఆస్ట్రేలియా మంత్రి స్టీవెన్ మార్ష‌ల్ మ‌త్రం గ్యారెంటీ ఇవ్వ‌లేక‌పోయారు. ద‌క్షిణ ఆస్ట్రేలియా ప్రాంతంలో వైర‌స్ సోకిన వారంద‌ర్నీ క్వారెంటైన్ చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఒక‌వేళ టెస్ట్ వేదిక‌ను మార్చాల‌నుకుంటే.. అప్పుడు తొలి టెస్ట్‌ను మెల్‌బోర్న్‌లో నిర్వ‌హించేందుకు సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  రెండు దేశాల మ‌ధ్య బాక్సింగ్ డే టెస్ట్ ఎంసీజీలోనే జ‌ర‌గ‌నున్న‌ది. ఒక‌వేళ అడిలైడ్‌లో వ‌ద్ద‌నుకుంటే.. ఎంసీజీ రెఢీగా ఉంటుంద‌న్నారు. న‌వంబ‌ర్ 27వ తేదీ నుంచి ఆస్ట్రేలియా ఏ జ‌ట్టుతో భార‌త్ మ్యాచ్ ఆడ‌నున్న‌ది. దీని కోసం వివిధ రాష్ట్రాల ప్లేయ‌ర్ల‌ను విమానాల్లో త‌ర‌లిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయ‌ర్లు ప్ర‌స్తుతం క్వారెంటైన్‌లో ఉన్నారు.  వారంతా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు. రికీ పాంటింగ్ ఆధ్వ‌ర్యంలో క్వారెంటైన్ ప్లేయ‌ర్ల‌కు కోచింగ్ జ‌రుగుతోంది.