శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 28, 2020 , 16:49:54

బాక్సింగ్‌ డే టెస్టుకు ప్రతిరోజూ 25వేల మంది ప్రేక్షకులు

బాక్సింగ్‌ డే టెస్టుకు ప్రతిరోజూ 25వేల మంది ప్రేక్షకులు

మెల్‌బోర్న్:  విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.  భారత్‌, ఆసీస్‌ మధ్య బాక్సింగ్‌ డే టెస్టు డిసెంబర్‌ 26 నుంచి ఆరంభంకానుంది.  ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా ఈ స్టేడియంలో ఒకేసారి లక్ష మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించొచ్చు.

బాక్సింగ్‌ డే టెస్టును చూసేందుకు ప్రతీరోజూ 25వేల మంది అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు.  ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన రెండో నగరం మెల్‌బోర్న్‌. బుధవారం నుంచి ఆ నగరంలో కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించారు. రిటైల్‌, హోటల్‌ తదితర వ్యాపార కార్యకలాపాలు తిరిగి తెరుచుకున్నాయి. 

మ్యాచ్‌ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ఎంతమంది ప్రేక్షకులను అనుమతించాలనేదానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసీజీలో ప్రతీరోజూ 25వేల మంది ఫ్యాన్స్‌కు అనుమతించడం సురక్షితమైనదేనని నిర్వాహకులు భావిస్తున్నారు. కరోనా వల్ల ఖాళీ స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.