గురువారం 29 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 17:48:28

ఈసారి ఐపిఎల్ 2020లో మాయంతి లాంగ‌ర్ లేదు.. కార‌ణం అదేన‌ట‌!

ఈసారి ఐపిఎల్ 2020లో మాయంతి లాంగ‌ర్ లేదు.. కార‌ణం అదేన‌ట‌!

భారతదేశంలోని స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్‌లో అత్యంత ప్రసిద్ది చెందిన వారిలో  మాయంతి లాంగర్ ఒక‌రు. గ‌త ఏదేండ్లుగా స్టార్ స్పోర్ట్స్ నిర్వ‌హిస్తున్న ఎన్నో కార్య‌క్ర‌మంలో మాయంతికి అవ‌కాశ‌మిచ్చారు. ఇప్పుడు ఐపిఎల్ 2020కి ఆమె లేక‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో ఆమె అభిమానులు నిరుత్సాహానికి గుర‌య్యార‌నే చెప్పొచ్చు. ఐపిఎల్ 2020 యాంకర్ల జాబితాలో ఆమె లేకపోవడానికి గల కారణాన్ని మాయంతి లాంగర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

'గత ఐదేళ్లుగా ఎన్నో సంఘటనలను ఎదుర్కోవటానికి స్టార్ స్పోర్ట్స్ నాకు అధికారాన్నిచ్చింది. అవ‌స‌ర‌మైన ప‌రిస్థితుల్లో నాకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డింది. నేను ఐదు నెల‌లు గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్ప‌టికీ సౌక‌ర్య‌వంత‌మైన హోస్టింగ్ చేయ‌డానికి వారు అనేక స‌ర్దుబాట్లు చేశారు. ఐపిఎల్ 2020 షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగి ఉంటే నేను యాంక‌రింగ్‌గా కొన‌సాగుండేదాన్ని. ఆరు వారాల క్రితమే నేను పండింటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాను. ఇత‌ని రాక‌తో మా జీవితం ఎంతో మారిపోయింది. ఇప్పుడు ఐపిఎల్‌ను నేను ఇంటి నుంచే వీక్షిస్తాను. స్టార్‌స్పోర్ట్స్ ఇండియా జ‌ట్టుకు శుభాకాంక్ష‌లు' అని ట్విట‌ర్‌లో పేర్కొన్న‌ది మాయంతి.  ప్రముఖ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ భార్య‌ మాయంతి అన్న‌ విషయం అంద‌రికీ తెలిసిందే. వీరు ముగ్గురు క‌లిసున్న ఫోటోను షేర్ చేసి అభిమానుల‌తో పంచుకున్న‌ది మాయంతి.


logo