మంగళవారం 20 అక్టోబర్ 2020
Sports - Sep 27, 2020 , 20:24:08

IPL 2020:మయాంక్‌ మెరుపు హాఫ్‌సెంచరీ

IPL 2020:మయాంక్‌ మెరుపు హాఫ్‌సెంచరీ

షార్జా:  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 26 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు.   ఐపీఎల్-13వ  సీజన్‌లో అగర్వాల్‌కిది రెండో అర్ధశతకం.   ఆరంభం నుంచి స్వేచ్చగా బ్యాటింగ్‌ చేస్తూ పంజాబ్‌ స్కోరును పరుగులు పెట్టిస్తున్నాడు. రాహుల్‌ తెవాటియా వేసిన 8వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్‌ బాది 19 రన్స్‌ రాబట్టాడు. మయాంక్‌ వీరవిహారం చేస్తుండటంతో పంజాబ్‌ 9 ఓవర్లలోనే 100 పరుగులు మార్క్‌ దాటింది.

ఈ క్రమంలో సీజన్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని ఈ జోడీ నమోదు చేసింది.  కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ సహకారం అందిస్తుండటంతో మయాంక్‌ అలవోకగా భారీ సిక్సర్లు బాదేస్తున్నాడు.  11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. మయాంక్‌(76), రాహుల్‌(38) క్రీజులో ఉన్నారు. 


logo