టోక్యో: ఆమె ఓ ఆల్‌రౌండర్. చదువులోనే కాదు ఆటల్లోనూ ఫస్టే. అప్లైడ్ మ్యాథ్స్‌లో పీహెచ్డీ పూర్తి చేయడమే కాదు.. ఇప్పుడు ఒలింపిక్స్ సైక్లింగ్‌లో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె పేరు అనా కీసెన్‌హోఫర్. ఆస్ట్రియాకు చెందిన ఈమె.. ఫేవరెట్స్కు కూడా షాకిస్తూ సైక్లింగ్ రోడ్ రేస్‌లో గెలవడం విశేషం. అయితే ఇదే రేసులో నెదర్లాండ్స్‌కు చెందిన అనెమీక్ వాన్ వ్లూటెన్ తాను గెలిచానని తప్పుగా భావించింది. చివరికి అది పొరపాటని తెలుసుకొని సిల్వర్‌తో సరిపెట్టుకుంది. లైన్ క్రాస్ చేసిన సమయంలోనూ ఈ విజయం తాను అసలు ఊహించలేదని రేసు తర్వాత అనా కీసెన్‌హోఫర్ చెప్పింది. మరోవైపు వాన్ వ్లూటెన్ మాట్లాడుతూ.. నిజంగానే తాను గెలిచానని భావించినట్లు తెలిపింది.