మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 28, 2020 , 22:40:30

సూర్య కుమార్‌ అర్ధశతకం

సూర్య కుమార్‌ అర్ధశతకం

అబుదాబి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధసెంచరీతో చెలరేగాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో యాదవ్‌ ఒంటరిగా పోరాడుతున్నాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి దూకుడుగా ఆడుతూ జట్టును లక్ష్యం దిశగా నడిపిస్తున్నాడు. 29 బంతుల్లోనే 6ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 16వ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సూర్యకుమార్‌ 13 రన్స్‌ రాబట్టాడు. ముంబై విజయానికి ఇంకా 24 బంతుల్లో 35 పరుగులు చేయాల్సి ఉంది. 16 ఓవర్లకు ముంబై 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ప్రస్తుతం సూర్యకుమార్‌(59), హార్దిక్‌ పాండ్య(8) క్రీజులో ఉన్నారు.