మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 12:34:37

కివీస్‌-భార‌త్ మ్యాచ్‌కి వ‌ర్షం అడ్డంకి

కివీస్‌-భార‌త్ మ్యాచ్‌కి వ‌ర్షం అడ్డంకి

వెల్లింగ్ట‌న్ వేదికగా భార‌త్‌- న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్‌కి వ‌రుణుడు అడ్డుప‌డ్డాడు. టీ బ్రేక్ త‌ర్వాత వ‌ర్షం కురుస్తుండ‌డంతో మ్యాచ్‌కి అంత‌రాయం ఏర్ప‌డింది. అంత‌క‌ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌.. 101 ప‌రుగుల‌కే ఐదు వికెట్ల‌ను కోల్పోయింది. ముఖ్యంగా ఓవ‌ర్‌కాస్ట్ ప‌రిస్థితుల‌ను స‌ద్వినియోగం చేసుకున్న కివీస్ బౌల‌ర్లు చెల‌రేగారు.  పృథ్వీ షా (16), చ‌టేశ్వ‌ర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), హ‌నుమ విహారి (7) వ‌రుస వికెట్స్ తీసి భార‌త్‌ని ఇబ్బందుల్లోకి నెట్టారు.  భార‌త బ్యాట్స్‌మెన్స్‌లో  ఓపెన‌ర్ మ‌యాంక్‌ అగ‌ర్వాల్ (34), అజింక్యా ర‌హానే ( 38 బ్యాటింగ్ )  కాస్త ఫ‌ర్వాలేద‌నిపించారు. ప్ర‌స్తుతం భార‌త్ ఐదు వికెట్ల న‌ష్టానికి 122 ప‌రుగులు చేయ‌గా క్రీజులో పంత్‌( 10 నాటౌట్‌), ర‌హానే ఉన్నారు.  ఆ స‌మ‌యంలో వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్‌ను నిలిపేశారు. బౌలింగ్ విష‌యానికి వ‌స్తే అరంగేట్ర బౌల‌ర్ కైలీ జెమీస‌న్‌కు మూడు వికెట్లు ద‌క్కాయి. టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌ చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ద్వారా   న్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ రాస్ టేల‌ర్ ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. వ‌న్డేలు, టీ20లు, టెస్టులు ఇలా మూడు ఫార్మాట్ల‌లోనూ వంద చొప్పున మ్యాచ్‌ల‌ను పూర్తి చేసుకున్న తొలి క్రికెట‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు.


logo